సైరా కి సహాయ పడుతున్న బాల కృష్ణ

Google+ Pinterest LinkedIn Tumblr +

సైరా నరసింహ రెడ్డి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమే కాకుండా ఎవత్ భారత్ దేశం అంతటా ఎదురు చూస్తున్న సినిమా.
చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు, టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో మూవీ పై అంచనాలు ఇంకా పెరిగాయ్. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇటీవలే హైదరాబాద్ లో చిత్రీకరించారు. సాధారణముగా చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాలకు షూటింగ్ లొకేషన్స్ ఎప్పుడు ఒక పెద్ద సమస్య గా ఉంటాయ్. సరైన లొకేషన్స్ దొరక్క ఇబ్బంది పడ్డ సినిమాలు అనేకం. అలనాటి కాలాన్ని ప్రేక్షకులకి చూపించటం అంత సులభం కాదు, అందుకోసం సహజసిద్ధంగా ఉండే ప్రాంతంలో షూటింగ్ చేయాలి.

ఇప్పుడు సైరా చిత్ర బృందం  మొదటి సారి విదేశీ లొకేషన్ లో షూటింగ్ చేయటానికి జార్జియా ప్రాంతానికి వెళ్లారు. గతంలో ఇదే ప్రదేశంలో క్రిష్ దర్శకత్వం లో బాల కృష్ణ హీరోగా నటించిన ” గౌతమి పుత్ర శాతకర్ణి ” సినిమా షూటింగ్ జరిగింది. ఈ లొకేషన్ లో సుమారు 20 రోజుల పాటు షూటింగ్ జరగనుందని సమాచారం. క్రిష్ గతంలో తీసిన ” గౌతమి పుత్ర ” కూడా చారిత్రక నేపధ్యం ఉన్న సినిమా. అప్పుడు క్రిష్ మరియు బాల కృష్ణ ఎంతో రీసెర్చ్ చేసి, అనేక ప్రాంతాలను పరిశీలించిన తర్వాత జార్జియా నగరాన్ని ఎంపిక చేసారు. ఇప్పుడు అదే లొకేషన్ చిరు సైరా కోసం ఉపయోగ పడుతుంది. ఈ విధంగా సైరా కోసం బాలయ్య తన వంతు సహాయం చేసారు.

Share.