మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈసినిమా రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. దర్శకుడు సురేందర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందించారు. సినిమా అక్టోబర్ 2న విడుదలై వారం రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. వారం రోజుల నుంచి సైరా చిత్రం తన జోరును కొనసాగిస్తూనే ఉంది.
సైరా చిత్రంను మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుంచి నిర్మించాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు భారీ తారాగణంతో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్ళు రాబడుతుంది. సైరాకు ఇప్పుడే ఏ సీనిమా పోటీ లేకపోడంతో బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్ళను కొల్లగొడుతుంది.
వారం రోజుల్లో సైరా నరసింహారెడ్డి సినిమా రూ.118.46కోట్లను వసూలు చేసింది. థ్రియోటికల్ రైట్స్ పరంగా సినిమాను చూస్తే రూ.150కోట్లకు అమ్మారు. అయితే ఇంకా ఈ మార్క్‌ను దాటాలంటే దాదాపుగా ఇంకో రూ.30కోట్లు వసూలు కావాల్సి ఉంది. సినిమా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద తిరుగులేని దూకుడు ప్రదర్శిస్తుండటంతో ఆ మార్కును దాటడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది.
ఏరియాల వారిగా సినిమా వసూలు చేసిన లెక్కలు ఇలా ఉన్నాయి..
నైజాం రూ. 24.17కోట్లు,
సీడెడ్ రూ. 15.10కోట్లు
నెల్లూరు రూ. 3.89కోట్లు
గుంటూరు రూ.8.45కోట్లు
కృష్ణా రూ 6.43కోట్లు
వెస్ట్ గోదావరి రూ.5.75కోట్లు
తూర్పు గోదావరి రూ.7.46కోట్లు
యూఎ రూ.12.31కోట్లు
కర్నాటక రూ.13.59కోట్లు
తమిళనాడు రూ. 2.10కోట్లు
కేరళ రూ. 85లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 5.30కోట్లు
నార్త్ అమెరికా రూ. 8.91కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ రూ. 4.15కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా వసూలైన మొత్తం రూ.118.46 కోట్లు..