సైరాకు శ‌నివారం షాక్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ సైరా తొలి మూడు రోజులు ఓ ఊపు ఊపేసింది. మెగాస్టార్ అభిమానులు థియేట‌ర్ల వ‌ద్ద భారీగా పోటెత్త‌డంతో సినిమాకు మూడు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రు.54 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌చ్చింది. అయితే ఇక్క‌డే ఈ సినిమాను రు.107 కోట్ల‌కు అమ్మారు. అంటే ఇంకా స‌గం అమౌంట్ రిక‌వ‌రీ చేయాల్సి ఉంది. ఇక నాలుగ రోజు శ‌నివారం నుంచి ప్రారంభ‌మ‌య్యే వీకెండ్ సీజ‌న్‌తో పాటు ద‌స‌రా సెల‌వుపై సైరా యూనిట్ భారీగా ఆశ‌లు పెట్టుకుంది.

ఇక ఓవ‌ర్సీస్‌లో సైతం అక్టోబ‌ర్ 2 సెల‌వు అని… మంగ‌ళ‌వారం ఆఫ‌ర్లు ఉంటాయ‌ని కాబట్టి అదిరిపోయే ప్రీమియ‌ర్ వ‌సూళ్లు వ‌స్తాయ‌ని వేసుకున్న లెక్క‌లు అన్ని త‌ప్పాయ్‌. అయితే ఈ లెక్క‌ల‌న్ని త‌ప్పాయ్‌. ఇక ఆంధ్రాలో రేట్లు చాలా భ‌యంక‌రంగా పెంచేశారు. నేల నుంచి బాల్కనీ వరకు ఉత్తరాంధ్రలో 300 రూపాయలు, మిగిలిన చోట్లు రెండు వందలు, కొన్నిచోట్ల 150 మాదిరిగా ఫిక్స్ చేసుకున్నారు. కోర్టు నుంచి ఈ మేరకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

అయితే వారం రోజుల పాటు ఇంత పెద్ద రేట్లు ఫిక్స్ చేసి సినిమాను నిల‌బెట్ట‌డం ఎవ్వ‌రికి సాధ్యం కాదు. కొంత‌మంది ఇది రిస్క్ అని చెప్పినా కూడా యూనిట్ విన‌లేదు. ఈ రేట్లు చూసి ఫ్యామిలీలు సినిమా చూసేందుకు ముందుకు వెళ్ల‌డం లేదు. ఇక రోజు రోజుకు వ‌సూళ్లు దిగ‌జారుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆంధ్రా బేస్‌డ్ స్టోరీ కావ‌డంతో ఆంధ్రా, నైజాం మిన‌హా మిగిలిన అన్ని భాష‌ల్లోనూ సినిమా తేలిపోతూ వ‌స్తోంది. శనివారం కూడా కిందకే జారింది. అంతేకానీ మీదకు లేవలేదు.

ఇక ఆదివారం ఆశ ఒక్క‌టే మిగిలి ఉంది. సోమవారం ట్రెండ్ చూస్తే ఆ ఆశలు నిలబడతాయో లేదో తెలుస్తుంది. ఇప్పటికి ఓవర్ సీస్ నుంచి తెలుగునాట వరకు బయ్యర్లు సగం రికవరీ అయ్యారు. అయితే ఇలా రికవరీ అయిన దాంట్లో ఫిక్స్ డ్ హైర్ లు, అడ్వాన్స్ లు వగైరా వున్నాయి.

Share.