‘ సైరా ‘ 5 డేస్ క‌లెక్ష‌న్స్‌… చిరు దెబ్బేశాడా..

Google+ Pinterest LinkedIn Tumblr +

భారీ అంచనాల నడుమ రిలీజైన పాన్ ఇండియా చిత్రం `సైరా-నరసింహారెడ్డి` ఐదు రోజుల బాక్సాఫీ ర‌న్ కంప్లీట్ చేసుకుంది. ఇక భారీ అంచ‌నాలు, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి సినిమా కావ‌డంతో భారీ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల నుంచి 72 కోట్ల షేర్ వసూలైంది. అటు అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. దాదాపు 200 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇంకా చాలా పెద్ద మొత్తాల్ని వసూలు చేయాల్సి ఉంటుంది. అందుకు లాంగ్ రన్ లోనూ స్థిరంగా వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

అయితే ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సైరా స్లో అయిన మాట వాస్త‌వం. అటు నార్త్‌లోనూ, ఇటు సౌత్‌లో తెలుగు మిన‌హా మిగిలిన భాష‌ల్లోనూ సినిమా ప్లాప్ కిందే లెక్క‌. ముఖ్యంగా తెలుగు నేటివిటికి సంబంధించిన స్టోరీ కావ‌డంతో సైరా అంచ‌నాలు అందుకోలేక‌పోతోంది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదు రోజుల షేర్ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

వైజాగ్ – 9.98 కోట్లు

ఈస్ట్ – 7.39 కోట్లు

వెస్ట్ – 5.26 కోట్లు

కృష్ణ – 5.39 కోట్లు

గుంటూరు -7.38 కోట్లు

నెల్లూరు – 3.19కోట్లు

సీడెడ్ – 12.61 కోట్లు

నైజాం -20.95 కోట్లు

దాదాపు 200 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేశారు. రూ.270 కోట్ల మేర బడ్జెట్ వెచ్చించామని కొణిదెల కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అంత పెద్ద మొత్తం వసూలు చేయాలంటే ఇంకా చాలా దూరంలో ఉందని అర్థమవుతోంది. మ‌రి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సైరా ఫైన‌ల్‌గా ఏం చేస్తుందో ? చూడాలి.

Share.