కోలీవుడ్ హీరో సూర్య హీరోగా తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎన్.జి.కే. ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ అనగానే ఫ్యాన్స్ రావడం కామనే. సూర్య వచ్చాడని తెలిసి ప్రేక్షకులంతా షూటింగ్ లొకేషన్స్ కు వచ్చారట.
ఊహించని విధంగా జనాలు వచ్చేసరికి సూర్య సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేశాడని తెలుస్తుంది. షూటింగ్ జరిపితే ఖచ్చితంగా తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని అందుకే షూటింగ్ క్యాన్సిల్ చేశారట. సూర్య మాత్రం అక్కడకి వచ్చిన ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ కొందరికి సెల్ఫీలు ఇస్తూ ఆకట్టుకున్నాడు. షూటింగ్ క్యాన్సిల్ అయిన టెన్షన్ ఏమాత్రం లేకుండా అక్కడకి వచ్చిన అభిమానులతో సరదాగా ఉన్నాడు సూర్య.