మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా సురేఖ వాణి కూతురు కామెంట్స్ వైరల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరుపొందింది నటి సురేఖ వాణి.. ఇమే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలలో అక్కగా, వదినగా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇప్పటికి వందకు పైగా సినిమాలలో నటించిన సురేఖ వాణి చాలా సినిమాలలో కమెడియన్లకు భార్యగా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.అయితే ఈ మధ్య పెద్దగా అవకాశాలైతే రాలేదు.. కాని సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది.

Actress Surekha Vani turns 40, daughter throws special party - pics and  video go viral - Malayalam News - IndiaGlitz.com

ముఖ్యంగా తన కూతురు సుప్రీతా తో కలిసి అప్పుడప్పుడు పలు రకాల వీడియోలను పార్టీలను ఎంజాయ్ చేస్తూ ఉండేటువంటి ఫోటోలను షేర్ చేయడం జరుగుతుంది. సురేఖ వాణి భర్త మరణించినప్పటి నుంచి ఎక్కువగా కూతురుతోనే తన సమయాన్ని గడిపేస్తోంది సురేఖవాణి. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో సురేఖవాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వార్తలపై గతంలో ఒక ఇంటర్వ్యూలో సురేఖ వాణి కూతురు సుప్రీత స్పందించడం జరిగింది.

త్వరలోనే అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తానంటూ కూడా తెలియజేసింది. ప్రస్తుతం సురేఖవాణి వయస్సు నాలుగు పదులు దాటిపోయింది ఈ క్రమంలోనే సుప్రీత అభిమానులతో ఇంస్టాగ్రామ్ లో చిట్ చాట్ చేయడం జరిగింది. మీ అమ్మకు మళ్లీ పెళ్లి ఎప్పుడు చేస్తావ్ అంటూ ఒక నెటిజన్ అడగగా అందుకు సుప్రీత స్వీట్ గా రిప్లై ఇవ్వడం జరిగింది.. మంచి అబ్బాయి ఉంటే మీరే చూడండి త్వరలోనే పెళ్లి చేస్తానంటూ ఫన్నీగా మీన్స్ ను యాడ్ చేసి ఆన్సర్ చెప్పినట్టుగా తెలుస్తోంది.

గడిచిన కొద్ది రోజుల క్రితం కూడా అందరికీ పెళ్లి అవుతున్నాయి అంటూ ఒక ఫన్నీ వీడియోను కూడా సురేఖవాణి తెలియజేయడం జరిగింది. ఇది చూసిన కొంతమంది నేటిజెన్లు సైతం సురేఖవాణి అప్పటికి ఇప్పటికి అందంతో పిచ్చెక్కిస్తోంది.. ఆమె చేస్తున్న పనులను బట్టి చూస్తే త్వరలోనే సురేఖవాణి కూడా రెండవ వివాహం చేసుకోబోతుందేమో అంటూ అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వీరు ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించలేదు.

Share.