అప్పుడు కన్నీళ్లు వచ్చాయ్, అందుకే ఇంకో సినిమా చేయలేదు: సుప్రియ

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అయ్యారు అక్కినేని మనవరాలు సుప్రియ, తొలి సినిమాతోనే మంచి హిట్ ని సొంతం చేసుకున్నారు సుప్రియ. అటు తర్వాత అన్నపూర్ణ బ్యానర్ లో తెర వెనుక నుండి ఎన్నో హిట్ సినిమాలను అందించారు. ఇక తాజాగా గూఢచారి సినిమాలో నటించి మరో సారి ప్రేక్షకులని తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం విజయంలో సుప్రియ తన వంతు పాత్ర చక్కగా నిర్వర్థించరు. ఇక తాజాగా నటుడు అలీ యాంకర్ గా చేస్తున్న ఒక షో కి గెస్ట్ గా వచ్చారు నటి సుప్రియ.
అందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అలీ అడుగుతూ పవన్ కళ్యాణ్ గారితో మీ తొలి చిత్రం లో నటించినప్పుడు ఎలా అనిపించింది అని అడగ్గా..

దానికి సుప్రియ మొదట్లో పవన్ కళ్యాణ్ తెగ సిగ్గు పడేవాడని, తనకి అదే తొలి చిత్రం కావటం పైగా మెగా స్టార్ తమ్ముడిగా పరిచయం అవ్వటం తో తన పై ఒత్తిడి ఉండేదని తెలిపారు. ఇంకో విషయం ఏంటంటే ఆ సమయంలో ఇండస్ట్రీ లో స్ట్రైక్ కూడా జరుగుతుందని ఆ కారణం చేత కొంత మంది టెక్నీషియన్స్ షూటింగ్ కి వచ్చే వారు కాదని ఇది కూడా కళ్యాణ్ పై టెన్షన్ పెరిగే లాగా చేసిందని చెప్పారు. నేను మాత్రం నాకు వచ్చిన యాక్టింగ్ ని చేసేసేదాన్ని , కానీ కళ్యాణ్ గారిని ఒక సారి సరదాగా మీ కళ్ల జోడు తీసి నటించండని అప్పుడు మీరు పెట్టె ఎక్సప్రెషన్స్ మాకు స్పష్టంగా కనిపిస్తాయని అడిగారట.

అంతే కాకుండా కళ్యాణ్ గారు ఈ చిత్రంలో తన చేతుల పై నుండి చాల కార్లు ఎక్కించుకున్నారని, ఛాతి పై రాళ్లు కూడా పగలకొట్టించుకొని చాల కష్టపడ్డారు. అవి చూసి నాకు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు సుప్రియ.
ఇంకో ప్రశ్నకి సమాధానంగా నాకు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ‘ సినిమాలో నటించిన తర్వాత ఇంకో మూవీలో నటించాలని అనిపించలేదని, అందుకే రెండో సినిమా ఇప్పటి వరకు చేయలేదని సుప్రియ వెల్లడించారు.

Share.