suprita..తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరుపొందింది నటి సురేఖ వాణి.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె కూతురు సుప్రీతా (suprita)కూడా హీరోయిన్లకు దీటుగానే అందచందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసేటువంటి తతంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తల్లి కూతుర్లులా కాకుండా అక్కా చెల్లెల్లులా తన అందాలతో గ్లామర్ తో డాన్స్ వీడియోలతో రెచ్చిపోతూ ఉంటారు. సురేఖ వాణి ద్వారా తన కూతురు కూడా ఒక సెలబ్రిటీగా మారిపోయింది.
సురేఖ వాణి తెలుగు ఇండస్ట్రీలో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో చిత్రాలలో రకరకాల పాత్రలలో కూడా నటించింది. గత కొంతకాలంగా ప్రేక్షకులకు దూరంగానే ఉన్న ఈమె అడపా దడప సినిమాలలో నటిస్తోంది. గతంలో సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా కనిపించలేదు సురేఖ వాణి తన భర్త మరణించిన తర్వాత ఆ బాధ నుంచి మెల్లమెల్లగా బయటపడేందుకు తన కూతురు సహాయంతో ఈమె సోషల్ మీడియాలో బాగా దగ్గరయింది దీంతో అప్పటినుంచి సురేఖ వాణి సుప్రీత ఇన్స్టాగ్రామ్ లో బాగా ఆరితేరుతున్నారు.
సురేఖ వాణి తన కూతురు కంటే అందంగా కనిపిస్తూ ఉండడమే కాకుండా చిన్న వయసు కలిగిన దానిలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక సుప్రీతా కూడా తక్కువ కాదని చెప్పవచ్చు.. 18 ఏళ్లకే తన అంత చెందాలతో పాతికేళ్ల అమ్మాయి లాగా కనిపిస్తోంది. ఈమె చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. అప్పుడప్పుడు పలు రకాలుగా ట్రోల్ కి కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. తమకు పై వచ్చిన నెగటివ్ కామెంట్ల పైన కూడా బాగా ఫైర్ అవుతూ ఉంటారు ఈ తల్లి కూతుర్లు.
ఈ మధ్యకాలంలో వాటిని పట్టించుకోవడమే మానేసి అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే సుప్రితాకు బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి తెలిసిందే.. గతంలో తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన కొన్ని ఫోటోలను సైతం పంచుకొని ఆ విషయాన్ని తెలియజేసింది.తన పేరు రాఖీ జోర్డాన్ అతడు సింగర్ అయినప్పటికీ పలు ర్యాప్ సాంగులు ఆల్బమ్‌లు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువగా అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అతనితో దిగిన ఫోటోలను గతంలో పంచుకున్న ఈ బ్యూటీ మళ్లీ అతడితో దిగిన ఫోటోలను ఎప్పుడు షేర్ చేయలేదు. దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ అయ్యిందని అనుమానాలు కలుగుతున్నాయి.ఈ అనుమానాలకు తగ్గట్టుగానే గత కొద్దిరోజుల నుండి సుప్రీతా కూడా ఇంస్టాగ్రామ్ లో బ్రేకప్ స్టేటస్ లను, ఎమోషనల్ స్టేటస్ లను బాగా షేర్ చేస్తోంది. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.