సన్ని లియోన్ మీద కన్నేసిన మెగాస్టార్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏంటి సన్ని లియోన్ తో మన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడా అంటే.. ఇక్కడ మెగాస్టార్ అంటే టాలీవుడ్ మెగాస్టార్ కాదు మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి అని తెలుస్తుంది. మళయాళంలో సీనియర్ స్టార్ హీరోగా మమ్ముట్టి సంచలన విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన యాత్ర సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా మళయాళంలో ఆయన చేస్తున్న మధుర రాజా సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో సన్ని లియోన్ తో మమ్ముట్టి ఆడి పాడుతున్నాడు.

2016లో వచ్చిన పోకిరి రాజా సినిమా సీక్వల్ గా వస్తున్న మధుర రాజా సినిమాలో సన్ని స్పెషల్ సాంగ్ లో నర్తిస్తుంది. ఈ సాంగ్ షూటింగ్ లో సన్నితో మముట్టి దిగిన పిక్స్ కొన్ని బయటకు వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పిక్స్ వైరల్ గా మారాయి. సన్నితో మమ్ముట్టి సాంగ్ కూడా అదరగొడుతుందట. బాలీవుడ్ క్రేజీ స్టార్ గా మారిన సన్ని లియోన్ సౌత్ సినిమాల మీద గురి పెట్టింది. బాలీవుడ్ లో దాదాపు అమ్మడు పని అయిపోయినట్టే అంటున్నారు.

పోకిరి రాజా సూపర్ హిట్ కాగా ఆ సినిమా సీక్వల్ గా వస్తున్న మధుర రాజా కూడా అలరిస్తుందని చెబుతున్నారు. సన్ని స్పెషల్ సాంగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి మమ్ముట్టితో సన్ని సయ్యాట మళయాళ ఆడియెన్స్ కు ఏరేంజ్ లో కిక్ ఇస్తుందో చూడాలి.

Share.