టాలీవుడ్ ఇండస్ట్రీకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన నటుడు సునీల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలకు ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ కమెడియన్ గా అడపాదడప సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాడు. సునీల్ యాక్టింగ్ జర్నీలో పుష్ప సినిమా ఒక పెద్ద ఊపు తీసుకొచ్చింది. సునీల్ గెటప్ నుంచి యాక్టింగ్ వరకు ప్రతి విషయంలోనూ తనదైన శైలిలో నిరూపించుకున్నాడు. ఇక ఆ సినిమాలో సునీల్ విలనిజం చూసిన తమిళ మలయాళ దర్శక రచయితలు సునీల్ కు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు.
అంతేకాకుండా సునీల్ కోసం ప్రత్యేకంగా కొత్త కొత్త క్యారెక్టర్లు డిజైనర్లు వెయిట్ చేస్తున్నారు. అక్కడి హీరోలు దర్శకులు ఈ మధ్యనే సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడుగా నటించిన భారీ బ్లాక్ బస్టర్ సినిమా జైలర్ ఈ సినిమాలో సునీల్ క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయగా ఆ తరువాత మార్క్ ఆంటోనీ నిన్న రిలీజ్ అయిన జపాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. నిజానికి శివ కార్తికేయన్ హీరోగా నటించిన మావిరన్ సినిమాతో తమిళ చలనచిత్ర పరిశ్రమకు సునీల్ పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమాలో సునీల్ చేసింది చిన్న పాత్ర అయినా మలయాళ చిత్ర పరిశ్రమకు సునీల్ పరిచయం అవుతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.
తమిళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిస్తున్న టర్బో సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన పాత్రలో పోషించబోతున్నాడని నిజానికి మలయాళ సినిమాలలో తెలుగు నటులకు ఆఫర్లు రావడం చాలా తక్కువ ఒకరిద్దరికీ ఆ అవకాశాలు వచ్చిన అవి అంత ప్రాధాన్యత ఉన్నవి కాదు ..అయితే కానీ ఇప్పుడు సునీల్ ఇంత మంచి అవకాశం ఆయన్ని వెతుక్కుంటూ రావడం మామూలు విషయమైతే కాదు. ఇలా సునీల్ కి ఆఫర్లు రావడం పుష్ప సినిమా ఎఫెక్ట్ ఏ ఎందుకంటే ఆ సినిమాలో సునీల్ క్యారెక్టర్ అందరిని ఆకట్టుకుంది.