ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించిన సునిల్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు హీరోగా చేయడంతో సక్సెస్ కాలేకపోవడం జరిగింది.. దీంతో కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆమధ్య రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా కామెడీ పాత్ర లేదా సీరియస్ పాత్రలలో ఎలాంటి అవకాశం వచ్చినా సరే వదలకుండా చేస్తూ అందరిని అలరిస్తూ ఉన్నారు. ఇక 2021లో పుష్ప చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించి మరింత క్రేజీ సంపాదించుకున్నారు సునీల్.
పుష్ప చిత్రంలో మంగళం శ్రీను అనే ఒక పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే ఏ సినిమా వచ్చిన కాదనకుండా చేసుకుంటూ వెళుతున్న సునీల్ కు ఇప్పుడు తాజాగా రజనీకాంత్ తో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ సినిమాలలో కూడా తన హవా కొనసాగించాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి తమిళంలో రెండు సినిమాలలో నటించినట్లుగా తెలుస్తోంది సునీల్. రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో సునీల్ నటించిన అందుకు సంబంధించి ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ముఖ్యంగా డ్రెస్సింగ్ మాత్రం కాస్త వింతగా కనిపిస్తోంది.
ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ మలయాళ లెజెండ్ మోహన్‌లాల్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. తెలుగులో ఒకప్పటి స్టార్ కమెడియన్ గా మంచి హవా సృష్టించిన సునీల్ విలన్ గా నటిస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సన్ పిక్చర్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు.నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా కోసం సునీల్ ఏకంగా రూ.2 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.