ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్ లోని ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఉన్న పోస్టర్ ని చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసారు. వీరిద్దరిని చూస్తుంటే అలనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ని చూస్తున్నట్టే ఉండటం విశేషం. ఈ రోజు ఉదయం ఇదే బయోపిక్ లోని ఏ ఎన్ ఆర్ గా నటిస్తున్న అక్కినేని సుమంత్ లుక్ ని అఫీషియల్ గా రిలీజ్ చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ ఇద్దరు కలిసి సిగరెట్ తాగుతున్న పోస్టర్ ని విడుదల చేయటం వారిద్దరి మధ్య ఎంతటి దగ్గర బంధం ఉందొ అర్ధం అవుతుంది.
క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతి కానుకగా 2019 లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రముఖ బాలీవుడ్ కథానాయిక విద్య బాలన్ ఈ సినిమాలో బసవతారకమ్మ పాత్రలో కనిపించనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ సిఎం పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు.