గుణశేఖర్ డైరక్షన్ లో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా రుద్రమదేవి. గుణ టీం వర్క్స్ బ్యానర్ లో గుణశేఖర్ డైరెక్ట్ చేసి నిర్మించిన ఈ సినిమా త్రిడిలో వచ్చింది. ఈ సినిమాలో సుమన్ విలన్ రోల్ చేశారు. అయితే ఈ సినిమా టైంలో తనకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు సుమన్. అనుష్కతో ఫైట్ ఉంటుందని కథ చెప్పినప్పుడు ఒప్పించాడని కాని సినిమాలో అది పెట్టలేదని అన్నారు సుమన్.
అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని వెళ్లడించారు. తెలుగులో మొదటిసారి విలన్ గా చేసిన సినిమా రుద్రమదేవి. ఆ సినిమాలో అనుష్కతో ఫైట్ ఉంటుందని సినిమా ఒప్పించారు తీరా సినిమాలో ఆ ఫైట్ లేకుండా చేశారు. ఒకవేళ ఫైట్ ఉండి ఉంటే నా కెరియర్ కు ప్లస్ అయ్యేది అది కూడా లేకుండా చేశారు.
అందుకే తనకు రావాల్సిన రెమ్యునరేషన్ విషయమై చెక్ బౌన్స్ కేస్ వేసి కోర్ట్ ద్వారా డబ్బు రాబట్టుకున్నానని అన్నారు సుమన్. రుద్రమదేవి సినిమా వెనుక జరిగిన ఈ విషయాలతో సుమన్ ఆశ్చర్యపరచాడు. ఆ సినిమాలో తన పాత్ర కట్ చేయడానికి గల కారణాలేంటో గుణశేఖర్ నే అడగాలని అన్నారు సుమన్.