ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చిన సుదీర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎలాంటి స్టేటస్ ఉందో సుడిగాలి సుధీర్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు. ఒకవైపు జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుదీర్ ఆ తర్వాత బుల్లితెర ప్రేక్షకులలో వెండితెర ప్రేక్షకులలో కూడా మరింత క్రేజీను అందుకున్నారు. సుధీర్ గతంలో మెజీషియన్ గా కూడా పనిచేయడం జరిగింది. కానీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత టాప్ పొజిషన్ కి చేరుకున్నారు. దీని అంతటికి కారణం జబర్దస్త్ అని ఎన్నోసార్లు సుడిగాలి సుదీర్ తెలియజేయడం జరిగింది.

Rashmi Gautam OPENS UP about her linkup with Sudigali Sudheer: In real  life, we are not great friends | PINKVILLA

ఇక జబర్దస్త్ తో వచ్చిన పాపులారిటీతో సుధీర్, రష్మీ మరింత క్రేజీ షోలు చేయడం వల్ల సుదీర్ , రష్మీ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉండేది. అయితే బుల్లితెరను వదిలి సుడిగాలి సుదీర్ వెళ్లిపోవడంతో టీఆర్పీ రేటింగ్ భారీగా తగ్గిపోయిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి క్రమంలోనే సుదీర్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సుధీర్, రష్మీ గతంలో ప్రేమించుకున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి.

అయితే సుధీర్ అలాంటిది ఏమి పట్టించుకోకుండా తన మరదలితో నిశ్చితార్థం చేసుకున్నారని గడిచిన 40 గంటల నుంచి సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారుతోంది .తన సొంత మరదల్ని సుదీర్ నిశ్చితార్థం చేసుకున్నాడని తెలిసి అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అతి త్వరలోనే సుదీర్ తన మరదల్ని వివాహం చేసుకోబోతున్నారని న్యూస్ వైరల్ గా మారుతుంది దీంతో రష్మీ, సుధీర్ అభిమానులు సైతం తెగ బాధపడుతున్నట్లు సమాచారం.

అయితే ఎప్పటికైనా సుధీర్, రష్మి వివాహ బంధంతో ఒకటి అవుతారని అభిమానుల సైతం అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ట్విస్ట్ ఏంటి అంటూ తెగ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.నిశ్చితార్థం న్యూస్ వైరల్ గా మారడంతో సుధీర్ ఈ విషయం పైన స్పందిస్తారు లేదా చూడాలి మరి. ప్రస్తుతం వరుస సినిమాలతో సుధీర్ కూడా బిజీగా ఉన్నారు.

Share.