జబర్దస్త్ లో మొదట కమీడియన్ గా వచ్చిన సుధీర్ టీమ్ లీడర్ రేంజ్ కు ఎదిగాడు. సుధీర్ అనగానే గుర్తొచ్చే ఒకే ఒక మాట రష్మీనే.. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ అంటే లక్షలాది మంది ప్రేక్షకులకు ఫేవరెట్ గా మారిపోయారు.ఈమె కూడా జబర్దస్త్ షో కి యాంకర్ గా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇక సుధీర్ జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్ళిపోయిన తరువాత ఈ కాంబో ని చూసే అవకాశం ప్రేక్షకులకు రావటం లేదు.
చాలామంది సుదీర్, రష్మీ కలిసి కనిపిస్తే చాలు అని కోరుకుంటున్నారు.. అలా ప్రతి ప్రోమో కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు. ప్రస్తుతానికి ఎవరికివారు డిఫరెంట్ చానల్స్ లో షోలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. సుధీర్ అయితే గాలిగాడు సినిమాతో హీరోగా అయిపోయాడు. వీరిద్దరూ కలిసి కనిపించకపోయినా చాలాసార్లు వీళ్లు ప్రస్తావన మాత్రం వస్తూనే ఉంటుంది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రష్మీని ఆటపట్టించడం కోసం కొన్నిసార్లు సుదీర్ పేరు బయటకు తీస్తుంటారు. ఇప్పుడు కూడా అలానే మాట్లాడారు కానీ అది కాస్త శృతిమించిందేమో అనిపించేలా ఉంది.
ఆది ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం వాలెంటైన్స్ డే సందర్భంగా ‘చెప్పు బుజ్జి కన్నా’ పేరుతో ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా స్టేజ్ పై వచ్చిన రష్మీని.. ఫిబ్రవరి 14 కదా ఒకళ్ళకు గట్టిగా ఒకటి ఇవ్వాలనుకుంటున్నానని రష్మీ చెప్పింది. ఈ మాటకు ఆది నాకు ఇచ్చేయండి..నేనెళ్ళిఅతడికి ఇస్తాను. అని సుధీర్ గురించి పరోక్షకంగా చెప్పుకొచ్చాడు. ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా?.. బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఏదో రోజు సడన్గా బాబుని ఇవ్వడాలు ఇలాంటివి చేయకండి. అని రష్మీ పై సెటైర్ వేశాడు. ఈ మాట విన్న సుధీర్ అభిమానులు బి గ్రేడ్ లాంటి మాటలు ఏంటి అని మండిపడుతున్నారు. ఏదేమైనా సరే కామెడీ పేరు చెప్పుకొని ఇలాంటి మాటలు అనడం కరెక్ట్ కాదు.