యువ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ” నన్ను దోచుకుందువటే ” సినిమా ట్రైలర్ నిన్న విడుదల చేసారు. ఈ సినిమా సుధీర్ బాబు సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు, సుధీర్ తొలి సారి నిర్మాతగా మారి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయ్. ఇక నిన్న విడుదలైన ట్రైలర్ పై పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇందులో భాగంగా మంచు లక్ష్మి ట్వీట్ చేస్తూ ” సినిమా ట్రైలర్ చాల కొత్తగా, ఇంటరెస్టింగ్ గా ఉంది, నిర్మాత గా మారినందుకు సుధీర్ బాబు కు శుభాకాంక్షలు. నన్ను దోచుకుందువటే సినిమా ఘన విజయం కావాలని కోరుకుంటున్న” అని తెలిపారు. ఈ ట్వీట్ కి బదులిస్తూ సుధీర్ ” థాంక్ యు లక్ష్మి, ప్రొడ్యూసర్ మరియు యాక్టర్ గా ఎలా రాణించాలో మీరు కొన్ని సలహాలు ఇవ్వండి, మీరు ఎంతో సులభంగా ఆ రెండు శాఖలని సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు ” అని రిప్లై చేసారు. చూద్దాం ఈ ట్వీట్ కి మంచు లక్ష్మి ఎటువంటి సలహాలు ఇస్తుందో.
Thank you Lakshmi 🤗Keep sending me some tips about managing the both sides, producer and actor. It's been a game for you😊 https://t.co/Ojv8VqwQTj
— Sudheer Babu (@isudheerbabu) September 11, 2018