స్టేడియం దద్దరిల్లేలా 83 మూవీ ట్రైలర్ రిలీజ్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది బయోపిక్ లను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కపిల్ దేవ్ జీవిత నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో ’83’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్‌ రాజ్‌ భాసీన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.దీపికా పదుకొనె, కబీర్‌ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్‌ నడియాడ్‌వాలా, ఫాంటమ్‌ ఫిలిమ్స్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్‌ లిమిటెడ్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది..తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయగా.. ఇందులోని కొన్ని సన్నివేశాలు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి.

లండన్‌ లార్డ్‌ క్రికెట్‌ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ.. ట్రైలర్ రిలీజ్ చేశారు. కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ పూర్తిగా ట్రాన్స్‌ఫాం అయ్యాడు. తన అద్భుతమైన షాట్స్‌తో ఇండియాకి విజయాన్ని అందించాడు కపిల్. ఆ సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో కపిల్ డేర్ డెవిల్స్ ప్రస్థానం ఎలా సాగింది? వారికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనే విషయాలను 83 సినిమాలో ఆవిష్కరించారు అని తెలిపారు డైరెక్టర్ కబీర్ ఖాన్‌.

Share.