మాస్టర్ ప్రీతమ్ రెడ్డి సమర్పణలో రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై వస్తున్న చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్.. ఈసినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్. సినిమా అంతా కొత్త నటులతోనే రూపొందించారు. సంజయ్ ఎడమ హీరోగా, శ్రీనాథ్ మాగంటి హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రం ట్రైలర్ చూస్తే ఓ సందేశాత్మక చిత్రంగా అనిపిస్తుంది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాను జె.కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బి.ఓబుల్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాకు యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. అయితే సినిమా ట్రైలర్‌ను దర్శకుడు కరుణ కుమార్ కట్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే సినిమాపై మంచి అంచనాలే వినిపిస్తున్నాయి.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ట్రైలర్ చూస్తే సమాజంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఓటమి సమస్యను ప్రధానాంశంగా తీసుకుని సినిమాను రూపొందించినట్లు ఉంది. ప్రతి విద్యార్థి జీవితంలో ఓటమి ఉంటుంది.. అదే క్రమంలో గెలుపు ఉంటుంది.. అయితే ఓటమి విద్యార్థులను కుంగదీస్తుంది. ఓటమి నుంచి సరైన ఓదార్పు లేనప్పుడు విద్యార్థి మానసిక స్థితి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది. అందుకే ఓటమి వచ్చినప్పుడే స్నేహితులు తోడుగా నిలిచి దైర్యం చెబితే ఎలాంటి ఆత్మహత్యలు జరుగవు అనే సందేశంతో సినిమాను రూపొందించినట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.