బడా నిర్మాత చేతుల్లోకి సిల్లీ ఫెలోస్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లరి నరేష్, సునీల్ కలిసి నటించిన సినిమా సిల్లీ ఫెల్లోస్. భీమనేని శ్రీనివాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ రిలీజ్ ముందు దాకా అంచనాలు లేని ఈ సినిమా ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అల్లరోడితో సునీల్ చేసే కామెడీ మళ్లీ వారిద్దరిని ఫాం లోకి తెచ్చేలా ఉంది.

సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను సీడెడ్, వైజాగ్ ఏరియాలు కాకుండా మిగతా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనీల్ సుంకర కొనేశారట. సినిమా ట్రైలర్ కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసి ఆయన ఈ సినిమా కొనేశారట. ఈమధ్య ఆయన కొన్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టాయి. వాటిలానే సిలీ ఫెల్లోస్ కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

అల్లరి నరేష్ ఈ సినిమా తర్వాత మహేష్ మహర్షిలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమా మీద కూడా అల్లరోడు చాలా అంచనాలు పెట్టుకున్నాడు.

Share.