సినిమాలలో ఒక్కసారి ఎంట్రీ ఇచ్చాక అన్ని విషయాలలో ఆచితూచి అడుగులు వేయాల్సిందే.నటీనటులు సైతం మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే ఇక మొదటికే మోసం వస్తుంది. దీంతో కెరియర్ పోగొట్టుకోవలసి కూడా వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్లో కొంతమంది హీరోయిన్ల పరిస్థితి ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది. వారి గురించి తెలుసుకుందాం. కొంతమంది తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల తెలుగు సినీ పరిశ్రమతో పాటు పూర్తిగా కెరీయర్ని కూడా పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారిలో..
1). పూజా హెగ్డే:
టాలీవుడ్ లో డీజే సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈమె రెమ్యూనరేషన్ ని కూడా పెంచేసింది. ప్రస్తుతం ఒక చిత్రానికి రూ .5కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మధ్య వరుస ఫ్లాప్లు వస్తున్నప్పటికీ రెమ్యూనరేషన్ లో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. దీంతో పలువురు డైరెక్టర్లు సైతం ఈమెన హీరోయిన్గా ఎంచుకోవాలంటే భయపడుతున్నారు.
2). సమంత:
కెరియర్ పరంగా పిక్స్ లో ఉన్న సమయంలో నాగచైతన్యత విడాకులు తీసుకొని పలు వివాదాలకు దారితీసింది. ఆ తర్వాత ఈమె పైన పలు రకాలుగా రూమర్స్ కూడా వినిపించాయి. దీంతో ఇమే క్రాప్ కాస్త పడిపోయిందని చెప్పవచ్చు. సమంతకు సరైన హిట్టు లేక చాలా కాలం అవుతుంది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సమంత కెరియర్ ముగుసడమే ఖాయం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
3). రష్మిక:
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా పేరుపొందిన రష్మిక ఒకవైపు టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ లో పలు అవకాశాలను అందుకుంటోంది. ఇక కాంతారావు సినిమా విషయంలో డైరెక్టర్ రిషబ్ శెట్టి తో గొడవ పెట్టుకుని పలు వివాదాలలో దారితీస్తోంది.