సినిమా పరిశ్రమలో నటీమణుల పరిస్థితి ఒక్కొక్కసారి ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. ఎందుకంటే కొన్నిసార్లు వరుస విజయాల తర్వాత కూడా వారికి మంచి అవకాశాలు రావడం లేదు. ముఖ్యంగా నటీమణులకు ఇది వర్తిస్తుంది.. ఒక సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా హీరోకే దక్కుతుంది. కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయితే ఆ తప్పంతా హీరోయిన్ దే అన్నట్టు చూస్తుంటారు అభిమానులు
అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ సాధించిన కొందరు హీరోయిన్ల గురించి వారి ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుందాం..ఉదాహరణకు కేజీఎఫ్ సినిమాలో నటించినా శ్రీనిధి శెట్టి ఈమె పాన్ ఇండియా హీరోతో కేజిఎఫ్ ,కే జి ఎఫ్-2 రెండు సినిమాలలో నటించింది.. కానీ ఆమె చేతిలో ఇప్పుడు ఒక్క ఆఫర్ కూడా లేదు. అందుకు కారణం ఈమె రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేస్తోందని సమాచారం.
ఇక ప్రగ్య జైస్వాల్ కూడా కంచె సినిమాతో మంచి సక్సెస్ను సాధించింది.. ఆ తరువాత ఆమెకు అవకాశాలే రాలేదు.. మొన్నటికి మొన్న అఖండ సినిమాతో ఒక హిట్ కొట్టింది.. కానీ స్టార్ హీరోతో చేసినప్పటికీ ఆఫర్లు మాత్రం రావడం లేదు.
వరుస విజయాలతో దూసుకుపోతోంది హీరోయిన్ సంయుక్త మీనన్ ఆమె దురదృష్టం ఏంటో కానీ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి కానీ అవకాశాలు మాత్రం కనుమరుగవుతున్నాయి. మహానటి కీర్తి సురేష్ అలాగే బేబీ సినిమాలో నటించిన వైష్ణవి చైతన్య వీరిద్దరూ రీసెంట్ గా బిగ్ విజయాలను అందుకున్నారు కానీ ఇప్పటికీ వారికి సరైన ఆఫర్లు రాలేదు. కొందరికి టాలెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అదృష్టం అంటూ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ నటీమణులు తమకు ఎప్పుడు ఎప్పుడు మంచి ఆఫర్లు తగులుతాయా అని వెయిట్ చేస్తున్నారు.