ప్రముఖ ఆస్ట్రాలజర్ గా చెప్పుకుంటూ .. సినీ సెలబ్రిటీల, రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలను బహిర్గతం చేస్తూ.. వారి జాతకాలను బయటపెట్టే వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే వీణా వాణి గా గుర్తింపు తెచ్చుకున్న వాణి ని వివాహం చేసుకున్నారని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఎప్పుడు సెలబ్రిటీల గురించే కాకుండా ఈసారి తన గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే తన ఆహారపు అలవాట్ల గురించి కూడా ఆయన షాకింగ్ విషయాలు వెల్లడించారు..
రాంచీలో రాజ్ రప్ప టెంపుల్ ఉంటుందని l.. ఆ ఆలయంలో అమ్మవారికి మేక రక్తంతో అభిషేకం చేస్తారని ఆయన తెలిపారు. అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి నాకు మూడు కిలోల మటన్ ఇచ్చారని వేణు స్వామి చెప్పుకొచ్చారు.. ఆ మటన్ నేను ఉన్న రిసార్ట్ లో ఇవ్వగా పాలకూర పప్పులో మటన్ వేసి వండాడని.. ఆ మటన్ తాను మూడు ముక్కలు తిన్నానని ఆయన తెలిపారు.. సాధారణంగా నేను నాన్ వెజ్ తింటానని.. తినకూడదని శాస్త్రం ఉందా అని వేణుస్వామి ప్రశ్నించారు. కొన్ని దేవాలయాల్లో నాన్ వెజ్ ప్రసాదంగా ఇస్తారు. గతంలో ఒక అమ్మాయికి విడాకులు అయితే జిల్లా అంతట చర్చ జరిగేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు…
గతంలో పార్టీ మేనిఫెస్టో అంటే భగవద్గీత అని ఇప్పుడు దానిని ఎవరు పాటించడం లేదు అని తెలిపారు..దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారాలని కూడా ఆయన తెలిపారు ..అన్ని కులాల వాళ్లను నేను సమానంగా చూస్తాను అని కామెంట్లు చేశారు. అలాగే త్వరలోనే రష్మిక లోకసభ ఎంపీ అవుతారని కూడా నేనే స్పష్టం చేశాను అంటూ ఆయన తెలిపారు. గతంలో రష్మిక రాజకీయాలలోకి వెళ్ళబోతోంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఇంతవరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మళ్లీ వేణు స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారాయి.. మొత్తానికైతే వేణు స్వామి చేసిన ఈ కామెంట్ లో ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.