తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట ఛలో సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ్, హిందీ, కన్నడ వంటి భాషలలో పలు చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది.ఇప్పటికే పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజీ ను సంపాదించుకుంది రష్మిక. ఇక బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది.
అలాగే బాలీవుడ్లో రణబీర్ కపూర్ తో యానిమల్ చిత్రంతో పాటు పుష్ప -2 చిత్రంలో నటిస్తున్నద. రష్మిక గత కొద్దిరోజులుగా చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ గా మారుతొంది. రష్మిక రాసిన క్యాప్షన్ ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. డియర్ డైరీ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గా గడిచింది ఉదయం లేవగానే కార్డియో వర్క్ అవుట్ చేశాను ఆ తర్వాత ఫుడ్ తీసుకున్నాను రేపటి షెడ్యూల్ కోసం బ్యాక్ సర్దుకున్నాను ఎప్పటిలాగానే తన చుట్టూ వాతావరణ మంచు నన్ను బయటకు వెళ్లకుండా చేస్తోంది అంటూ తెలియజేసింది.
ఆ తరువాత డిన్నర్ చేశాను ఇక డెర్మటాలజీ అపాయింట్మెంట్ తీసుకున్నాను ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది కానీ అది క్యాన్సిల్ అయింది తిరిగి ఇంటికి వచ్చేస ఇక గుడ్ నైట్ బాగా పడుకో అంటూ రష్మీ రాసుకొచ్చింది. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్న రష్మీ ఇందులో డర్మాట్ అని రాసేయడంతో డెర్మటాలజీ అపాయింట్మెంట్ ఎందుకు తీసుకుంది అంటూ అభిమానులు తెగ చర్చలు జరుగుతున్నాయి. దీంతో రైస్‌మిల్ గత కొద్దిరోజులుగా చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయాన్ని రష్మిక క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.