తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కు ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. గతంలో ఎన్నో విభిన్నమైన సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించిన బాలయ్య ఈ మధ్యకాలంలో మాస్ సినిమాలలో నటిస్తూ బాగా ఆకట్టుకుంటున్నారు. బాలయ్య ఎలాంటి విషయాన్ని అయినా సరే మొహం మీద చెప్పేస్తూ ఉంటారు. ముఖ్యంగా తన మనసులో ఏది దాచుకోకుండా డైరెక్ట్ గా అనేస్తూ ఉంటూ ఉంటారు. 60 సంవత్సరాల వయసు దాటిన ఇప్పటికీ ఇంకా యంగ్ హీరోలకు పోటీనిస్తూ పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అలాంటి బాలయ్య సినిమాలో ఒక హీరోయిన్ కు అవకాశం ఇవ్వగా ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట. మరి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బాలయ్య వంటి హీరో సినిమాలో నటించడానికి ఎంతోమంది హీరోయిన్స్ ఇష్టపడుతూ ఉంటారు. ఇక అఖండ సినిమా తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. హీరోయిన్గా ప్రియాంక జవాకల్కర్ ను ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర ఉండబోతుందట. ఆ పాత్ర కోసం నాచురల్ స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన స్నేహా ను ఈ పాత్ర కోసం సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మొదట్లో ఈ సినిమా కథ విని ఓకే చెప్పినప్పటికీ.. కొన్ని కారణాల చేత ఈ సినిమా ను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో కొంతమంది నందమూరి అభిమానులు ఈమె పైన ఫైర్ అవుతున్నారు. అంతటి స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే వద్దంటావా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం నువ్వు ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు అయితే బాలయ్యను అవమానించినట్లే అని ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది . మరి ఈ విషయంపై హీరోయిన్స్ స్నేహ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.