అనుష్క శెట్టి టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అయితే దాదాపుగా గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా ఇమేది విడుదల కాలేదు. ఏ ముహూర్తానయితే సైజ్ జీరో సినిమా చేసిందో అప్పటినుంచి అనుష్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని వార్తలు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాత్ర కోసం ఈమె చాలా బరువు పెరిగిపోయింది..VFX తో మేనేజ్ చేయవచ్చునీ డైరెక్టర్ చెప్పిన వినకుండా ఆ పాత్ర కోసం తనకు బాగా నచ్చిందని భావించి బరువు పెరిగిపోయిందట.
ఇక అట తరువాత నుండి ఈమె తగ్గాలనుకున్న తగ్గలేక పోయిందని బరువు తగ్గే ప్రాసెస్లో గత కొంతకాలంగా సర్జరీలు చేయించుకొని ఎంతోమంది ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. యువి క్రియేషన్ లో చేస్తున్న ఒక సినిమా కోసం ఈమె సన్నబడాలని చూస్తోందట. అందుకోసం రెండు సర్జరీలు కూడా చేయించుకున్నట్లు సమాచారం. కానీ ఆ రెండు ఫెయిల్ అయ్యాయా అన్నట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అనుష్క ఎలా ఉందో ఇప్పుడు షూటింగ్ మొదలుపెట్టారు మేకర్స్ అయితే షూటింగ్ కు కొంచెం బ్రేక్ రావడంతో ఎప్పుడు ఇంకా బరువు పెరిగిపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా శివరాత్రి రోజున అనుష్క తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోని ఒక శివాలయానికి వెళ్ళింది. అక్కడ ఈమె ఫోటోలు,వీడియోలు తీసిన నేటిజెన్లు సైతం ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఈమెను చూసి అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కేవలం శరీరాకృతి మాత్రమే కాదు అనుష్క ముఖంలో కూడా చాలా ఘోరమైన మార్పులు కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం అనుష్కకు సంబంధించి ఈ ఫోటోలు వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారుతోంది.