టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తను నివాసముంటున్న భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తను ఉండే ఇంట్లో కొన్ని మంటలు చెలరేగాయి. ఈ బిల్డింగ్ ముంబైలో ఉన్నది. ఈమె ఉన్న 12వ అంతస్తు లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేయడం జరిగింది.
దీంతో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా ఈ మంటలు రావడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్.. నటుడు నిర్మాతజాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికి తెలిసిందే.
ఎన్నో రోజులుగా సీక్రెట్ లవ్ లో ఉన్న ఈ భామ తన ప్రేమ విషయాన్ని తన బర్తడే రోజు అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రస్తుతం ఆమె సినిమా షూటింగులో బిజీగా ఉన్నది. ఇక పోలీసులు రకుల్ ప్రీతిసింగ్ ఇంట్లో మంటలు ఎలా చెలరేగాయి అనే విషయంపై ఎంక్వైరీ చేస్తున్నారు.