తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు మోస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో భూమిక కూడ ఒకరు..ఈమె ఖుషి సినిమాతో అందులో వచ్చే నడుము సీన్ తో చాలా ఫేమస్ అయ్యింది. అయితే అప్పట్లో ఆ సీన్ చూడటానికి కుర్రాళ్ళు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. ఒకవేళ ఇప్పటికీ కూడా ఈ సినిమా వచ్చిన భూమిక నడుము చూడటానికి ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే సినిమాలకు గ్యాప్ ఇచ్చిన భూమిక ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తోంది. ఈ మధ్య కాలంలోనే ఎంబీఏ అనే సినిమాలో నానికి వదిన పాత్రలో నటించింది.
అంతేకాకుండా ఈమె అప్పట్లో స్టార్ హీరోలైన అందరితో నటించి గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా ఆమె ఏ సినిమాలో నటించిన అలాగే ఆ స్టార్ హీరోలు అదృష్టవంతులు అయ్యారు. దానికి కారణం ఆమె నటించిన సినిమాలే బిగ్గెస్ట్ హిట్ కావటం వల్ల.. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గటంతో యోగ టీచర్ అయిన భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే
అయితే పెళ్లి చేసుకున్న కొత్తలో వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఆనందంగా ఉండేవారట.. కానీ మళ్ళీ భూమిక కి సినిమాలపై మక్కువ ఉండటంతో నటించటానికి కాకుండా నిర్మాతగా మారతానని తన భర్తతో చెప్పిందట.. కానీ భరత్ మాత్రం ఆ విషయానికి ఒప్పుకోలేదట.. మన దగ్గర సినిమాకు పెట్టే అంత డబ్బు లేదని చెప్పాడట.. కానీ భూమిక వినకుండా ఒక సినిమాను కూడా తీసింది. ఆ సినిమా అట్టర్ ప్లాప్ కూడా అయింది ఇక సంపాదించిన డబ్బునంత పోగొట్టుకుంది.
ఇక దాని కారణంతోనే వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోవాలని అనుకున్నారట. కానీ వీరిద్దరికి నాగార్జున, దాసరి నారాయణ గారు సర్ది చెప్పారట..వీరిద్దరి మధ్య ఉండే విభేదాలను సాల్వ్ చేసి వీరిద్దరూ విడాకులు తీసుకోకుండా చేయడం జరిగిందట. అలా వీరు ఇద్దరూ ఇప్పటికీ కలిసి ఉన్నారు.