చిరంజీవిని చంపాలనుకున్న స్టార్ హీరో..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పనవసరం లేదు.. ఇయన స్వతహాగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఈయన వల్ల మెగా ఫ్యామిలీలోని చాలామంది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ లేనిదే మెగా ఫ్యామిలీ లేదు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు.

చిరంజీవి మెగా లుక్స్.. 90ల్లో అన్నయ్య స్టైల్ అదుర్స్.. | Megastar  Chiranjeevi rare and stylish photos in late 90s with superb mass looks pk–  News18 Telugu

అయితే అలాంటి మెగా హీరోని ఎలాగైనా చంపాలని కంకణం కట్టుకున్నాడట.. ఒక హీరో.. అసలు విషయంలోకి వెళ్తే మెగాస్టార్ గా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటుడు చిరంజీవి అలాంటి ఈ హీరో అంటే పడని వారు ఎలాగైనా చిరంజీవిని సినిమాల నుండి వెళ్ళగొట్టి తానే ఇండస్ట్రీకి స్టార్ హీరోగా మారాలని ఒక హీరో భావించాడట.అందరూ తనతోనే సినిమాలు తీయాలని అనుకున్నాడట. కానీ ఆ హీరో ఎన్నిసార్లు ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసిన కూడా అందరూ చిరంజీవితోనే సినిమాలు తీయడానికి ఇష్టపడేవారట.

ఇలా అందరూ చిరంజీవి నే సపోర్ట్ చేస్తూ ఆయనకే సినిమా అవకాశాలను ఇస్తూ ఉండడంతో చిరంజీవిపై కక్ష కట్టాడు ఆ హీరో.. దాంతో తన క్రిమినల్ మైండ్ ఉపయోగించి ఎలాగైనా తన కూతురు బర్త్డేకి చిరంజీవిని కచ్చితంగా రావాలని అడిగాడట. చిరంజీవి ఇంటికి వెళ్లి ఆ హీరో మళ్ళీ ఆహ్వానించారట.. కాబట్టి వెళ్ళాలి అనుకొని ఆ హీరో కూతురు బర్తడే కి వెళ్ళాడట. అయితే ఆ హీరో చిరంజీవికి భోజనం విషం కలిపి పెట్టాలని ప్లాన్ చేశాడట. కానీ ఆ హీరో ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయ్యింది.

ఎందుకంటే ఆ రోజు చిరంజీవికి షూటింగ్ బిజీలో ఉండటం వల్ల కేవలం 10 నిమిషాలు మాత్రమే బర్త్డే ఫంక్షన్కు హాజరయ్యాడు..వెంటనే వెనుతిరిగి వచ్చేసాడు. అయితే అక్కడే ఉన్న వారంతా గుసగుసలు గా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆ విషయం చిరంజీవి సన్నిహితుల చెవిలో పడి ఆ విషయాన్ని చిరంజీవికి చేరవేశారట .దాంతో చిరంజీవి షాక్ అయ్యాడు. అప్పటినుంచి తను ఆంజనేయ స్వామి భక్తుడిగా మారిపోయాడు తనని ఆ దేవుడే కాపాడాడని నమ్మకంతో ఉండేవారు.చిరంజీవి అభిమానులు చిరంజీవిని చంపాలనుకున్న ఆ స్టార్ హీరో ఎవరా అంటూ తెగ వేతికేస్తున్నారు.

Share.