సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. RRR సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రాజమౌళి మహేష్ తో సినిమా చేయడం కోసం సిద్ధమయ్యారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కోసం ఒక కథను సిద్ధం చేశారు. ఈ చిత్రం భారీ అడ్వెంచర్ కథ అన్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటినుంచో ఈ సినిమా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ మాత్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకు రానటువంటి ఒక కథ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి మహేష్ తో ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు రావడం జరిగింది ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ దాదాపుగా రూ.15 కోట్ల రూపాయల వరకు రాజమౌళి ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జూన్ నెలలో ఈ సినిమా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లాంచింగ్ రోజునే ఈ సినిమా క్యాస్టింగ్ కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హాలీవుడ్ తారాగణం ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు ,త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా చేయబోతున్నారు .ఇందులో హీరోయిన్స్ గా శ్రీ లీల, పూజా హెగ్డే నటిస్తున్నది. ఈ చిత్రం కూడా ఏడాది ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళి సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు మహేష్ బాబు.