తెలుగు దర్శకులలో రాజమౌళి ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి సక్సెస్ సినిమాలను అందుకున్నారు. ఈయన ఏ సినిమా తీసిన అందులో ఏదో ఒక మర్మందాగి ఉంటుందనే చెప్పవచ్చు. ఇప్పుడు మహేష్ బాబు తో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. రాజమౌళి . ఈ సినిమాకు హీరో క్యారెక్టర్రైజేషన్ ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని అంతర్జాతీయ వేడుకల ద్వారా జక్కన్న ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..ఈ సినిమా పాన్ వరల్డ్ లెవెల్ లో రూపొందించబోతున్నారు. ఇక ఈ సినిమాకు జక్కన్న గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.
ఈమధ్య వచ్చిన RRR సినిమాతో వచ్చిన ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. ఇంకా ఈ సినిమాలో మహేష్ బాబు వరల్డ్ ట్రావెల్ గా కనిపిస్తాడని సమాచారం. అలాగే అమెజాన్ అడవుల నేపథ్యంలో కథాంశం ఉండబోతుందని కూడా కాస్త లీక్ చేశారని తెలుస్తోంది.. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకి కథని సిద్ధం చేస్తున్న విజయేంద్ర ప్రసాద్ సూపర్ స్టార్ మూవీ మల్టిపుల్ సిరీస్ లలో ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఈయన చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈసారి మరింత గట్టిగానే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం మొదటి పార్ట్ కి రూ .300 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారని తెలుస్తోంది.ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రొడక్షన్ కోసం ఏకంగా రూ .15 నుంచి రూ .20 కోట్ల వరకు దర్శకుడు రాజమౌళి ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. రాజమౌళి ఇప్పటివరకు తీసిన ఎన్నో సినిమాలు ఒక రేంజ్ లో సక్సెస్ ని సాధించాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయబోతున్నారు అంటూ అటూ అభిమానులు సినీ ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.