డైరెక్టర్ రాజమౌళి తన తదుపరిచిత్రం పై ఇప్పటినుంచి భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంకా సినిమా మొదలు పెట్టకనే పలు ఊహగానాలు ఆకాశానికి దాటేస్తున్నాయి .బెస్ట్ కాస్టింగ్ ,మేకింగ్ వంటి అంశాల పైన ప్రతిరోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం ఈ సినిమాకి పనిచేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడి ప్రొడక్షన్ కంపెనీతో రాజమౌళి చేతులు కలిపి ఈ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.హాలీవుడ్ నటీనటులు కూడా నటించే అవకాశం ఉందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోని మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం .అంతేకాకుండా ఈ చిత్రాన్ని చైనాలోనూ భారీగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది .ఒక చైనాలోనే కాకుండా అమెరికా, జపాన్ రష్యా, ఆస్ట్రేలియా ,దుబాయ్ వంటి దాదాపుగా ముపైకి పైగా భాషలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు సమాచారం .ఈమెరకు ఓటీటి సంస్థలతో కూడా రాజమౌళి చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఈ సినిమా బడ్జెట్ పైన కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ తో చేయబోతున్న ఈ సినిమాకి రాజమౌళి ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారట .సరికొత్త టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రయాణాలతో ఈ సినిమా రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. RRR చిత్రంతో రాజమౌళి పాపులారిటీ మరింత పెరిగింది. కేవలం మహేష్ ను ముందు ఉంచుకొని రాజమౌళి తన చేయవలసిన పని చేయబోతున్నట్లు తెలుస్తోంది మరి ఈ విషయం పైన రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి.