SSMB -28 ఓటిటి రైట్స్ అన్ని కోట్లా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా కోసం ప్రతి ఒక్కరు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా విజయం తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు మహేష్. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం ఇది. దీంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఉన్నాయి అభిమానులకు. అయితే ఈ సినిమాకి కేవలం ఇంకా వర్కింగ్ టైటిల్ని SSMB -28 గా సెట్ చేయడం జరిగింది.

SSMB 28: Thaman To be Replaced By Tamil Music Director in Mahesh Babu's  Film? - Filmibeat

మహేష్ సరసన పూజ హెగ్డే , శ్రీ లీల నటిస్తున్నది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి తాజాగా ఒక విషయం వైరల్ గా మారుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఒక ప్రముఖ ఓటీటి సంస్ధ .. నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా సంక్రాంతి రోజు ప్రకటించడం జరిగింది. దీంతో ఈ సినిమా ఓటీటి హక్కులను దాదాపుగా రూ.80 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంతో మహేష్ ,డైరెక్టర్ త్రివిక్రమ్ కు మొదటిసారి పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ రేంజ్ లో హైట్ పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే రాలేదు కాని ఈ సినిమాకు సంబంధించి ఓటిటి రైట్స్ మాత్రం చాలా వైరల్ గా మారుతున్నది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు కేవలం SSMB -28; ప్రాజెక్ట్ అప్డేట్ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళితో భారీ బడ్జెట్ సినిమాలో నటించానున్నారు మహేష్ బాబు.

Share.