కార్తికేయ పెళ్లితో.. దగ్గర బంధువులైన రాజమౌళి, జగపతి బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +
రాజమౌళి తనయుడు కార్తికేయ ఓ ఇంటివాడవుతున్నాడు. కొన్నాళ్లుగా ప్రేమిస్తున్న పూజా ప్రసాద్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కార్తికేయ. ఆమె ఎవరో కాదు స్వయానా జగపతి బాబు అన్న రాం ప్రసాద్ కూతురు. అంటే రాజమౌళి, జగపతి బాబు వియ్యంకులయ్యారన్నమాట. సింగర్ గా తన కెరియర్ సాగిస్తున్న పూజా ప్రసాద్ కార్తికేయ లవ్ ప్రపోజల్స్ కు ఓకే చెప్పింది.
ఇక వారి ప్రేమకు ఇంట్లో వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫైనల్ గా నిన్న హైదరాబాద్ లో కొంతమంది సెలబ్రిటీస్ సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. రాజమౌళి తనయుడిగా కార్తికేయ ఆయన సినిమాలకు సెకండ్ యూనిట్ డైరక్టర్ గా పనిచేస్తుంటాడు. ఈమధ్య సహ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలకు వ్యవహరించాడు.
కార్తికేయ, పూజా ప్రసాద్ ల జోడి బాగుంది. పెళ్లి రిసెప్షన్ కు టాలీవుడ్ అంతా కదిలి వస్తుందని చెప్పొచ్చు. ఈ పెళ్లితో రాజమౌళి, జగపతి బాబు మరింత దగ్గర చుట్టాలయ్యారు.

Share.