అందాల తార శ్రీయ ప్రతి ఒక్కరికి పరిచయం చేయనవసరం లేదు. దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా టాలీవుడ్ లో తన అందంతో, నటనతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.
తెలుగు తెరతో పాటు , ఇతర భాషలలో కూడా తన హవా కొనసాగించిన అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల సరసన నటించి తన నటనతో ప్రేక్షకులను అబ్బుర పరిచింది శ్రియ.
అందానికి తగ్గ అభినయం తో, ప్రేక్షకులను కట్టిపడేయడమే కాకుండా..2018 లో ఆండ్రీ కోస్చీవ్‌ని పెళ్ళాడి సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉంటూ.. తన భర్త తో చేసే రొమాన్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటుంది.
ఇక అంతే కాకుండా తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోస్ తో పాటు, ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటూ ఉంటుంది శ్రియ. ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం బంగార్రాజు మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది అన్నట్లుగా వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రియ కుర్ర హీరోలతో సమానంగా అందాలను ఆరబోస్తూ ఉంటుంది.
చూసేదానికి అమాయకంగా కనిపించిన ఈమె చేసే పనులు మాత్రం కుర్రకారు లకు ఫీడ్ పుట్టించేలా ఉంటుంది.