శ్రీవల్లి పాత్ర కోసం రష్మిక అలాంటి పని చేసిందా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో రష్మికా కూడా ఒకరు. రష్మిక నటించిన ఈ సినిమాలో ఎక్కువగా సక్సెస్ సాధించిన వున్నాయి. ప్రస్తుతం రస్మిక పుష్ప సినిమాలో డి గ్లామరస్ గా నటిస్తోంది.త్వరలో “ఆడవాళ్లు మీకు జోహార్లు “అనే మూవీలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం రష్మిక నటించిన పుష్ప సినిమా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో ఈమె పాత్ర శ్రీవల్లి గా సుకుమార్ తెరకెక్కించడం జరిగింది.

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో కనిపించడానికి రష్మిక చాలా కష్ట పడినట్లు తెలుస్తోంది. ఆమె తన ఎక్స్ ప్రెషన్స్ తో పాటు, కొన్ని అలవాట్లను కూడా ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా చిత్తూరు యాసను నేర్చుకోవడానికి చాలా కష్ట పడినట్లు తెలుస్తోంది. తిరుపతి కి వెళ్లి అక్కడ ఉండే జనాలతో మాట్లాడి వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో తెలుసుకొని.. ఆ తరువాత శ్రీవల్లి పాత్రలో నటించినట్లు గా సమాచారం.ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు అందుచేతనే రష్మికాకు, శ్రీవల్లి పాత్ర ఫర్ఫెక్ట్ గా సూట్ అయింది అని నెటిజన్లు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.రష్మిక కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం.

Share.