యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శ్రీనివాస కళ్యాణం రిలీజ్‌కు రెడీ అయ్యింది. అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాతో నితిన్ మరోసారి అదిరిపోయే హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు చిత్ర యూనిట్. ‘శతమానం భవతి’ సినిమాతో స్టన్నింగ్ హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ‘శ్రీనివాస కళ్యాణం’ చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో బొమ్మ అదిరిపోవడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరోవైపు ఈ చిత్ర టీజర్, ట్రైలర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా కళ్లు చెదిరే విధంగా జరిగింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.27 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయడంతో ట్రేడ్ వర్గాలు షాక్‌కు గురయ్యారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇలాంటి బిజినెస్ చేయడం నిజంగా గ్రేట్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. నితిన్ కెరీర్‌లో ‘‘అ ఆ..’’ చిత్రం తరువాత అంతటి భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ‘శ్రీనివాస కళ్యాణం’ నిలిచింది.
అందాల భామ రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 9న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ చిత్ర ప్రపంచవ్యాప్త ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – ప్రీ-రిలీజ్ బిజినెస్(కోట్లలో)
నైజాం – 7.5
సీడెడ్ – 3.6
వైజాగ్ – 2.6
ఈస్ట్ – 1.8
వెస్ట్ – 1.5
కృష్ణా – 1.7
గుంటూరు – 2.0
నెల్లూరు – 0.9
టోటల్ ఏపీ+తెలంగాణ – 21.6 కోట్లు
కర్ణాటక – 1.5
రెస్టాఫ్ ఇండియా – 0.5
ఓవర్సీస్ – 3.4
టోటల్ వరల్డ్‌వైడ్ – 27 కోట్లు