యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శ్రీనివాస కళ్యాణం ఇటీవల విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా టీజర్, పోస్టర్స్, ట్రైలర్లు చూస్తే శతమానం భవతి షేడ్స్ ఎక్కువగా కనిపించడంతో మరో ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్ మూవీ రాబోతుందని మురిసిపోయారు జనాలు.
సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఓకే అనిపించినా కమర్షియల్ పరంగా మాత్రం దెబ్బకొట్టింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడంతో ఈ సినిమాను భారీ రేటు పెట్టి కొన్నారు బయ్యర్లు. అయితే చివరికి వారికి నష్టాలు తప్ప మరేమీ మిగల్లేదు. లై, ఛల్ మోమన్ రంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాలో డిజాస్టర్లలో హ్యా్ట్రిక్ కొట్టాడు నితిన్. ఈ సినిమా రిజల్ట్‌తో మనోడు తన నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడట. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 13 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది.
ఏరియాలవారీగా ఈ చిత్ర వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – క్లోజింగ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 5.10 కోట్లు
సీడెడ్ – 1.55 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.50 కోట్లు
గుంటూరు – 0.84 కోట్లు
ఈస్ట్ – 0.80 కోట్లు
వెస్ట్ – 0.54 కోట్లు
కృష్ణా – 0.68 కోట్లు
నెల్లూరు – 0.35 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.75 కోట్లు
ఓవర్సీస్ – 0.80 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 12.91 కోట్లు