బుల్లితెరపై పలు షోలతో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న యాంకర్ శ్రీముఖి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు..ఈమె తన గలగల మాటలతో ఎన్నో సినిమా ఫంక్షన్లకు ,ఆడియో రిలీజ్ ఈవెంట్లకు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకర్ గా చేస్తోంది. అయితే శ్రీముఖికి మంచి గుర్తింపు వచ్చింది మాత్రం పటాస్ షో ద్వారానే..ఆ తరువాత పలు షోలకు యాంకర్ గా వ్యవహరించి ఇప్పుడు టాప్-2 పొజిషన్లో ఉంది.
ఇక బిగ్ బాస్ లోకి వెళ్ళాక శ్రీముఖి రేంజ్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఒకవైపు మంచి పాత్రలు వస్తే సినిమాలలో నటించడమే కాకుండా బుల్లితెరపై బిజీ యాంకర్ గా కొనసాగుతోంది. అయితే అలాంటి శ్రీముఖి త్వరలోనే అందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది అంటూ నెట్టింట ఒక వార్త వైరల్ గా మారుతోంది.ఇంతకు అసలు విషయం ఏంటంటే..
శ్రీముఖి పెళ్లి అనగానే ఆ విషయాన్ని దాటేస్తోంది. కానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందట. శ్రీముఖి పెళ్లి పెద్దలు కుదించింది కాదట.. ప్రేమ వివాహం అన్నట్టుగా సమాచారం.. శ్రీముఖి గత కొద్దిరోజులుగా ఒక అబ్బాయిని ప్రేమిస్తోందని అయితే ఈ విషయం ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడుతోందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పటంతో పెళ్లికి ఇంకా లేట్ చేయటం అంత మంచిది కాదు అని శ్రీముఖి తండ్రి అనడంతో శ్రీముఖి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యిందట.
అయితే చాలా రోజుల నుంచి పెళ్లి అనగానే తప్పించుకొని తిరుగుతున్న శ్రీముఖి ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుందని తెలియడంతోనే చాలామంది సోషల్ మీడియాలో ఆమె పేరు వైరల్ చేస్తూ ఇన్ని రోజులు పెళ్లి లేదు ఏం లేదు చెప్పి ప్రియమైన వాడితో పెళ్లి పీటలు ఎక్కబోతోందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియడం లేదు కానీ..శ్రీముఖి వచ్చి క్లారిటీ ఇస్తేనే ఈ విషయానికి ఒక పుల్ స్టాప్ పడుతుంది.