టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ శ్రీ లీల ఈమె మొట్టమొదటిగా పెళ్లి సందD చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో తన కెరీర్ను బిజీబిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నటించినది రెండు సినిమాలే అయినప్పటికీ ఈమె చేతిలో మాత్రం పది సినిమాలకు పైగానే ఉన్నాయి. ఈ విషయాలు కాస్త పక్కన పెడితే
శ్రీ లీల జాతకం గురించి వేణు స్వామి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పుడు ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ మారుతున్నాయి. శ్రీ లీల జాతకం చూసిన వేణు స్వామి ఆమె జాతకం చాలా అద్భుతంగా ఉంది అంటూ అలాగే ఈమె పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇలాంటి జాతకం చాలా తక్కువ మందికి ఉంటుంది. అంతేకాకుండా 2028వ సంవత్సరానికి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా టాప్ హీరోయిన్ గా ఉన్న నయనతార జాతకంకు శ్రీ లీలా జాతకం కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయట.నయనతార కూడా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ను సంపాదించుకుందో అలాగే ఇప్పటికీ కూడా ఒరియాంటెడ్ సినిమాలలో రాణిస్తూనే తన లైఫ్ని లీడ్ చేస్తూనే ఉంది. అలాగే శ్రీ లీల కూడా వెనుతిరిగి చూసుకో లేనంత అవసరం ఆమె జాతకం ఉంది అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు.
ఇక వేణు స్వామి చెప్పిన మాటలకు శ్రీ లీల అభిమా నులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు .2028 అంటే ఐదేళ్లపాటు శ్రీ లీల ఇండస్ట్రీలో హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుందని తెలుస్తోంది. ఈమె సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.