తెలుగు సినీ ప్రేక్షకులకు నటి శ్రీ లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె పేరు తెలియకపోయినా ఈమె చెప్పే డైలాగు వింటే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.. బాబు చిట్టి అనే డైలాగుతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలక్ష్మి కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. దాదాపుగా 500 కు పైగా సినిమాలలో నటించి మెప్పించిన ఈమె కమెడియన్ గా కొన్ని సంవత్సరాల పాటు రాణించింది. కేవలం వెండితెరపై కాకుండా బుల్లితెర పైన కూడా పలు సీరియల్స్ లో నటించింది శ్రీలక్ష్మి..
ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలక్ష్మి తన కుటుంబం గురించి పలు విషయాలను తెలియజేసింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా నాన్నకు మేము ఎనిమిది మంది పిల్లలం .. తన తండ్రి అమర్నాథ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో అని కానీ జాండీస్ రావడం వల్ల పనిచేయడం మానేశారని తెలిపింది. తన తండ్రికి చిన్న చిన్న అవకాశాలు వచ్చిన తను హీరోగా మాత్రమే చేస్తానని మొండికేసేవారట .ఆర్థిక కష్టాలు ఎక్కువ కావడంతో తన తల్లి ఇండస్ట్రీలోకి పంపించాలనుకుందట ..అది తన తండ్రికి అసలు ఇష్టం లేదు ఆడపిల్లవి ఇండస్ట్రీలో కష్టాలు పడడం ఎందుకమ్మా అని తెలియజేస్తూ ఉండేవారట.
ఇక తన కుటుంబ పరిస్థితులు బాగోలేవు కదా అని చాలా బాధపడే వారిని శ్రీలక్ష్మి తెలుపుతోంది. కానీ తన తల్లి మాత్రం నువ్వు నటిస్తే అందరం కడుపునిండా తినగలం లేకపోతే ఇంత విషయం తాగి చస్తామని తెలియజేసిందట. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 41 ఏళ్లుగా రాణిస్తున్నాను తన తమ్ముడు రాజేష్ కూడా హీరోగా అయ్యారు ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు తీసుకున్నాము.. ఎంత త్వరగా వచ్చాడో అంతే త్వరగా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారని తెలిపింది లక్ష్మి. తనకు పెళ్లయింది భర్త కూడా ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదని తెలిపింది.