Srikanth..టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో శ్రీకాంత్ (Srikanth)కూడ ఒకరు. అప్పట్లో ఈయన నటించిన పెళ్లి సందడి సినిమా ఎంతో క్రేజ్ ని తెచ్చి పెట్టింది. శ్రీకాంత్ హీరోయిన్ ఊహ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరో శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ మధ్యకాలంలోనే శ్రీకాంత్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడంటు సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎందుకు విడిపోవాలనుకున్న రబ్బా అంటూ ఆలోచనలో పడ్డారు.
అయితే ఈ విషయంపై శ్రీకాంత్ తొందరగానే క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ అసలు సోషల్ మీడియాని ఎలా ఉపయోగించాలో కొంతమందికి తెలియదు. కొందరు మంచికి ఉపయోగిస్తారు. మరికొందరు చెడుకు ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో నేను నా భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాను అంటూ థంబ్ నెయిల్స్ ని సృష్టించి మరి వార్తలు రాశారు. కానీ అవన్నీ నిజం కాదు.. మేము విడిపోవడం లేదు. అని క్లారిటీ ఇచ్చారు శ్రీకాంత్
శ్రీకాంత్ ఫ్యామిలీ విడాకులు తీసుకుంటున్నారు అన్న వార్తలు చూసినప్పుడల్లా తన ఫ్యామిలీ చాలా బాధపడుతుందని చెప్పుకొచ్చారు. అయితే అప్పటినుండి నా భార్యకి ఇష్టం లేకపోయినా కూడా నేను అన్ని ఈవెంట్స్ కి ఫంక్షన్లకు తీసుకు వెళుతున్నాను. ఒకవేళ నేను ఒంటరిగా వెళ్తే ఎందుకు ఊహ గారిని తీసుకురాలేదు. మీరు విడాకులు తీసుకుంటున్నారా అని మళ్లీ మాపై వార్తలు వైరల్ చేస్తారేమో అని నాకు భయం వేసింది. అందుకనే మా ఆవిడకు ఇష్టం లేకపోయినా ప్రతి ఫంక్షన్ కి ప్రతి ఈవెంట్లకి తీసుకొని వెళుతున్నాను. ప్రస్తుతం శ్రీకాంత్ మాట్లాడిన మాటలు నెత్తింట్లో వైరల్ గా మారాయి.