టాలీవుడ్ లో చిన్నతనం నుంచి తన నటనతో ఆకట్టుకున్న నటి శ్రీదేవి ప్రతిఒక్కరికీ సుపరిచితమే..ఈమె పెద్దయ్యాక అతిలోకసుందరిగా పేరు సంపాదించుకుంది. తన అందంతో తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ముద్ర వేసుకుంది. ఇప్పటికీ కూడా శ్రీదేవి మరణించిన వార్త జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె అభిమానులు ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇది కాస్త పక్కన పెడితే తన మరణ వార్త గురించి ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంది.
తమ బంధువుల పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే బాత్రూం టబ్ లో పడి మరణించింది. అయితే ఇమే మరణించిన తర్వాత తన భర్త బొణి కపుర్ ఎన్నో అనుమానాలను విమర్శలను ఎదుర్కొన్నాడు. అయితే బోణి కి శ్రీదేవి అంటే చాలా ప్రాణం అయితే బోణికి పెళ్లి అయిభార్య పిల్లలు ఉండగానే వారందరినీ వదులుకొని శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య అందరి భార్యాభర్తలకు జరిగే గొడవలే జరుగుతూ ఉండేవట.
అయితే శ్రీదేవి మరణించిన తర్వాత ఏ రోజు కూడా బోణి ఆమె మరణం గురించి మాట్లాడలేదు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భార్య మృతికి ఇదే కారణమంటూ తేల్చి చెప్పాడు. శ్రీదేవికి నటన అంటే చాలా ఇష్టం అన్న సంగతి మనకు తెలుసు.. దానికోసమే తన అందాన్ని కాపాడుకోవడం కోసం స్ట్రీట్ డైట్ చేసేదట.
ఉప్పు కారం లేని ఆహారాన్ని తిని తను నీరసంగా తయారయింది. అంతేకాకుండా శ్రీదేవికి లోబీపీ కూడా ఉండేదట. డాక్టర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పినా కూడా శ్రీదేవి పట్టించుకోలేదట..ఇక దుబాయ్ కి వెళ్లేటప్పుడు కూడా కాస్త అనారోగ్యంతోనే ఉందట. శ్రీదేవి ది సహజ మరణం కాదు ప్రమాదవశాత్తు జరిగింది. కానీ నన్ను ఎన్నో ప్రశ్నలు వేశారు. వాటన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెబుతూ అన్నింటిని భరించాను అని చెప్పారట బోణి కపూర్.