తెలుగు ఇండస్ట్రీ లోకి చైల్డ్ యాక్టర్ గా సినిమా అవకాశాలను అందుకొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ శ్రీదేవి.. అతిలోక సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి ఇప్పటి హీరోయిన్స్ తో పోలిస్తే ఆమె అందం ఆమె నటన ఇప్పటి హీరోయిన్స్‌లో ఎక్కడ కనిపించడం లేదు. కాగా అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు చేరుకుంది శ్రీదేవి.శ్రీదేవి తన అభిమానుల్ని విడిచి ఎక్కడికి పోలేదు సినిమాల రూపంలో మన మధ్యనే తిరుగుతోంది అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకోస్తూ ఉంటారు.
శ్రీదేవి వ్యక్తి పరంగా చాలా మంచిదని ఆమె చాలామందికి హెల్ప్ చేసిందని ఆమె ఫ్యాన్స్ ఆమెకి ఎప్పుడూ పాజిటివ్ మార్కులే వేస్తూ ఉంటారు. అయితే ఆమెలో తెలియని కొత్త యాంగిల్ ఉందని ఆమె స్టార్ హీరోలతో తప్ప మరే హీరోలతో నటించదని అంతే కాదు స్టేటస్ లో ఆమె ప్రియారిటి కూడా ఉంటుందని ఓ స్టార్ కమెడియన్ ని చూసి అతనితో నేను సినిమా చేయను అంటే చేయను అని వెళ్లిపోయిందట. ఇంతకు ఆ కమెడియన్ ఎవరు అనుకున్నారా..ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బ నవ్వించే కళ్ళు చిదంబరం.
ఈయన మొదటిగా కళ్ళు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో గోవిందా గోవిందా సినిమా షూటింగ్ టైంలో అతని పక్కన శ్రీదేవి ఓ సీన్ చేయాలంటే భయపడిపోయి నో చెప్పిందట.అప్పుడు రాంగోపాల్ వర్మ నువ్వు ఈ సినిమాలో చేయకపోయినా పర్లేదు ఆయన్ని అలా అవమానించడం మంచిది కాదు అంటూ కోప్పడ్డాడట.
ఈయన ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను గెలుచుకొని ఆయనకంటూ ఓ ఇమేజ్ను పెంచుకున్నాడు అంటూ రాంగోపాల్ వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట శ్రీదేవికి.. ఇక ఆ మాటలకు శ్రీదేవి చిదంబరం ఎక్కడ కనిపించినా రెస్పెక్ట్ గా మాట్లాడేదట. ఈ విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు వర్మ సమాచారం.