అతిలోకసుందరి అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందం, అభినయం లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో నటించి ఆ కాలంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అయ్యింది. సినీ కెరియర్ పరంగా ఎంత క్రేజ్ ను సంపాదించుకుందో వ్యక్తిగత జీవితంలో అన్ని సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా శ్రీదేవి కష్టాలు తెలిస్తే మాత్రం ఎంతటి వారైనా సరే కన్నీటి పర్యంతం అవ్వాల్సిందే.
నిజానికి తెరమీద డైరెక్టర్ చెప్పినట్టు చేసే శ్రీదేవి తెర వెనుక మాత్రం ఏది తినాలన్నా.. తాగాలన్నా.. చివరికి టాబ్లెట్ వేసుకోవాలన్నా సరే ఆమెకు తల్లి చెప్పిందే వేదం.. ఆమె మాట ఎప్పుడూ జవదాటదు.. కనీసం తల్లి చెప్పకుండా చిన్న ఐస్ క్రీమ్ కూడా తినేది కాదు. అంతలా జీవితంలో స్వతంత్రాన్ని కోల్పోయింది శ్రీదేవి. అన్ని వదులుకొని బాలీవుడ్లోకి అడుగుపెట్టడంతో ఆమె ఒంటరిగా మారిందని చెబుతూ ఉంటారు. హిట్ మీద హిట్ కొడుతూ తారస్థాయికి చేరుకున్న శ్రీదేవిని అదే సమయంలో వ్యక్తిగతంగా పాతాలానికి తొక్కేశారు. తల్లికి ఆపరేషన్ అవడం అది కాస్త బెడిసి కొట్టడంతో అదే కేసు అయ్యింది. అయితే ఆ కేసులో డబ్బులు మాట అటు ఉంచితే అదే సమయంలో ఈమెకు బోనీ కపూర్ తో పరిచయం కూడా ఏర్పడింది.
ఇకపోతే అప్పటికే పెళ్లయి అప్పుల్లో కూరుకుపోయిన బోనీ కపూర్ మాయలో పడిపోయింది శ్రీదేవి. అంతేకాదు బోనీ కపూర్ మొదటి భార్య, ఆమె పిల్లలు.. శ్రీదేవి పై దాడికి కూడా దిగారు. అయినా మొండి గా నిలబడిన శ్రీదేవి అతడిని వివాహం చేసుకుంది. ఒకపక్క చవతి తండ్రి అయ్యప్పకు తల్లి రాజేశ్వర్ కి పుట్టిన లత పెట్టే వేధింపులు అన్ని ఇన్ని కావడం మరొకవైపు బోనీకపూర్ అప్పులు .. మరోవైపు ఎదిగిన ఇద్దరు కూతుర్ల భవిష్యత్తు.. అన్ని ఆమెను మానసికంగా మరింత కృంగతీసాయి.. వీటిని తట్టుకోలేక సమస్యలను మర్చిపోవడానికి ఫుల్లుగా తాగి మత్తుకు బానిస అయ్యింది. అదే మత్తులో చివరికి జారీ పడిపోయి చనిపోయింది శ్రీదేవి. అయితే ఈమెకు ఉన్న 200 కోట్ల రూపాయల బీమా కోసమే ఇదంతా చేశారని టాక్ కూడా వైరల్ అయింది. ఏది ఏమైనా ఉన్నతంగా బతకాల్సిన శ్రీదేవి జీవితంలో ఇన్ని కష్టాలు చూసి ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతం అవుతున్నారు.