Sri Reddy..గత ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవి చూసిన టిడిపి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో కాస్త ఊరటం ఇచ్చిందని చెప్పవచ్చు. అనూహ్యంగా నాలుగు ఎమ్మెల్సీ సీట్లను సొంతం చేసుకోవడంతో చంద్రబాబు కళ్ళల్లో ఎన్నో సంవత్సరాల తర్వాత కాస్త సంతోషం కనిపిస్తోందని చెప్పవచ్చు. ఇక టిడిపి అభిమానులలో కూడా పూర్వవైభవం కనిపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ అధికార పార్టీ వైసీపీ మాత్రం మీకు అంత సీను లేదని 175 స్థానాలు మావే అంటూ చాలా ధీమాగా తెలియజేస్తున్నారు.
అధికార వైసీపీలో ఉంటూనే ప్రతిపక్షానికి మద్దతు పలికిన కొంతమంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.. కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఈ నలుగురు ఎమ్మెల్యేలను విషపురుగులతో పోలుస్తూ పలు ఆసక్తికరమైన పోస్టులను షేర్ చేస్తున్నారు వైసిపి అభిమానులు ఇక వీరి పైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి..(Sri Reddy)
మీ ఆశయాల మీద నమ్మకంతో మీరేమి ఇవ్వకుండా మీ మీద ప్రేమతోనే మీతోనే నడిచే వాళ్ళ మేమంతా విషపురుగులు విషమే తప్ప అమృతాన్ని కురిపిస్తాయా జగనన్న పదవి కోట్లు ఇవ్వకున్నా మిమ్మల్ని నమ్మే కోట్లు మంది ఉన్నారు ..చంద్రబాబును నమ్మి విషపురుగులు మాత్రమే ఉంటాయి.. అంటూ జై జగన్ అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది శ్రీరెడ్డి.. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక పోస్ట్ వైరల్ గా మారుతోంది.
శ్రీ రెడ్డి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదు కానీ ప్రచారంలో మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తిట్టడమే ఈమె పని అన్నట్టుగా తెలియజేస్తూ ఉంటుంది. అందుకుగాను ఆమెకు కోట్ల రూపాయలు ఇస్తున్నారని వార్తలు అయితే వినిపిస్తూ ఉంటాయి.కానీ తాను మాత్రం పార్టీ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఎవరు తనని సంప్రదించలేదని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానంతోనే పార్టీకి సేవ చేస్తున్నానంటూ తెలియజేసింది శ్రీరెడ్డి.