విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరో. అర్జున్ రెడ్డి తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. ఇక ఇప్పుడు తాజాగా రష్మిక మందాన జంటగా ‘గీత గోవిందం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకాత్వం వహించగా, బన్నీ వాస్ ప్రొడ్యూసర్ గా పని చేసారు. అయితే చిత్ర యూనిట్ ఇటీవలే విడుదల ఈ సినిమాలోని పాటలు కొంత వివాదాస్పదంగా మారాయి.
నిన్న విడుదల చేసిన ‘వాట్ ద ఫా’ అనే పాటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ పాటలోని లిరిక్స్ పై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే ఈ పరిణామాల పై ఈ పాటని రచించిన శ్రీమణి ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చారు. ఎవరి మనోభావాలు కించపరచాలని మేము ఈ పాటని రాయలేదు, అయినా ఈ పాట కొంత మందిని బాధ పెట్టిందని మా దృష్టికి వచ్చింది. కావునా మేము తిరిగి ఈ పాటలోని కొన్ని వాక్యాలను మళ్లీ రచించి మరల యు ట్యూబ్ లో విడుదల చేస్తాం అని ప్రకటించారు.
‘వాట్ ద ఫా’ సాంగ్ పై రచయిత సెన్సషనల్ కామెంట్స్
Share.