ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ప్రతి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది.. అది హీరోయిన్ విషయంలో అయినా సరే హీరో విషయంలో అయినా సరే మొన్న సమంత కూడ..చాలామంది హీరోయిన్లు చాలా ఆరోగ్య సమస్యలతో సఫర్ అవుతూ ఉన్నారు.. అయితే ఇప్పుడు యంగ్ డైనమిక్ బ్యూటీ శ్రీ లీల కూడా ఏదో వ్యాధితో బాధపడుతున్న విషయం బయటపడింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ హవాక్ అవుతున్నారు.
ఇంతకు శ్రీ లీల బాధపడుతున్న ఆ అరుదైన వ్యాధి ఏంటి నిజంగానే అది ట్రీట్మెంట్ లేని వ్యాదట ..పెళ్లి కూడా కష్టమేనా అనే సంగతులు వినిపిస్తున్నాయి..శ్రీ లీల పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తరువాత బోలెడన్ని అవకాశాలను అందుకుంది.అంతేకాకుండా 10 సినిమాలకు సైన్ కూడా చేసి రికార్డును క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ ఉన్న తగ్గేదే లేదు అన్నట్లు రోజురోజుకు తన ఆఫర్లను పెంచుకుంటూ పోతోంది ఈ ముద్దుగుమ్మ
అయితే శ్రీ లీల గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..అదేంటంటే శ్రీ లీలకు ఒక అరుదైన వ్యాధి ఉందని ఆ వ్యాధి వల్ల పెళ్లి చేసుకోవడం కూడా కష్టమే అంటూ కొంతమంది నేటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ఒక్కసారి తుమ్ములు వస్తే దాదాపు 20 నిమిషాల వరకు తుమ్ముతూనే ఉంటుందట.ఇలాంటి ఇబ్బందిపడి డాక్టర్లను కలిసినా కూడా ఫలితం లేకుండా పోయిందట. అంతే కాకుండా ఇలాంటి వ్యాధితో శ్రీ లీల షూటింగ్లో కూడా ఎన్నో ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చిందట.అయితే ఈ విషయాన్ని స్వయంగా ఒక సందర్భంలో శ్రీ లీలనే చెప్పటం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.