హీరో యష్ తో ఉన్న రిలేషన్ ఇదే అంటున్న శ్రీ లీల..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

కే జి ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా మారిపోయారు హీరో యష్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలై మంచి విజయాలను అందుకుంది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో యష్. ఇక ఈ చిత్రం పార్ట్ -2 విడుదల మంచి విజయాన్ని అందుకుంది. అలాగే కన్నడలో హీరోయిన్ శ్రీలీల మొదట కొన్ని చిత్రాలలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్లోకి పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా హీరో యష్, శ్రీ లీల మధ్య రిలేషన్షిప్ ఏంటనే విషయం వైరల్ గా మారుతుంది వాటి గురించి తెలుసుకుందాం.

טוויטר \ Yash Trends בטוויטר: "Sree Leela Attended #AyraYash Birthday  Party❤️ @sreeleela14 #HBDAyraYash https://t.co/TVJr6UGMc8"

మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న శ్రీలీల ఒక డాక్టర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమెకు కూడా సినీ బ్యాగ్రౌండ్ ఉండడం వల్ల వరుసగా సినిమా ఆఫర్లు వెలుబడుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలీల మాట్లాడుతూ నాకు కన్నడ హీరో యష్ కు ఎలాంటి రిలేషన్షిప్ లేదని కాకపోతే.. హీరో యష్ భార్య రాధికాకు మా అమ్మే డెలివరీ చేసిందని తెలియజేసింది. ఈ విషయాన్ని పట్టుకొని మా ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయని క్లారిటీ ఇచ్చింది.

సినీ బ్యాగ్రౌండ్ ఉందని సినిమా అవకాశాలు అందుకే వస్తున్నాయని అంటున్నారు.మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు.. కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది మా అమ్మ ఆమెకు డెలివరీ చేయడం వల్లే ఫ్రెండ్షిప్ బాగా పెరిగిపోయిందని తెలియజేస్తుంది. దాంతో హీరో భార్యను అక్క అని పిలుస్తూ ఉంటానని తెలియజేసింది శ్రీలీల.

Share.