ప్రముఖ యాంకర్ శ్రీముఖి గురించి.. ఆమె వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాను ఏ షోలో హోస్టుగా చేస్తున్న సరే ఆ షో కి వచ్చిన సెలబ్రిటీలను సందడి చేయడమే కాకుండా ఆ షో వీక్షించే ప్రేక్షకులకు కూడా మంచి వినోదాన్ని పంచుతూ ఉంటుంది.. గలగల మాట్లాడుతూ ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మను బుల్లితెర రాములమ్మగా అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారు. ఒకవైపు పలు షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈమె సోషల్ మీడియా ఫాలోవర్స్ ని కూడా బాగా పెంచుకునే పనిలో పడింది.
ముఖ్యంగా తన గ్లామర్ షో వొలకబోయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. తన అందాల విందు చేస్తూ అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తూ… ట్రాన్స్పరెంటు దుస్తుల్లో లో అందాలను కూడా ప్రదర్శిస్తూ మరింత రెచ్చిపోతున్న శ్రీముఖికి సోషల్ మీడియాలో కూడా బాగా ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన పదజాలంతో అందరికీ షాక్ ఇచ్చింది అని చెప్పాలి ..అసలు విషయంలోకి వెళితే తాజాగా ముక్కు అవినాష్ తో కలిసి ఈమె స్టార్ మా పరివార్ షో కి హోస్టుగా చేస్తోంది ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కి ఎప్పటికప్పుడు సీరియల్స్ సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈసారి కూడా బ్రహ్మముడి ,గృహలక్ష్మి సీరియల్స్ సభ్యులు వచ్చి సందడి చేయగా అందులో చాలామంది డబుల్ మీటింగ్ డైలాగులతో మరింత రెచ్చిపోయారు.
ఒక విషయంపై గృహలక్ష్మి లాస్య.. ఇంద్రనీల్ కసి గురించి బాగా నేర్పిస్తాడు అనగా వెంటనే ఫైమా ఐ వాంట్ కసి అంటూ కామెంట్లు చేస్తుంది. దీంతో కాస్త చొరవ తీసుకున్న గృహలక్ష్మి కస్తూరి ఇంద్రనీల్ కసిబిడ్డ కాదు పసిబిడ్డ అంటూ చెప్పడంతో వెంటనే శ్రీముఖి ఏ యాంగిల్ లో మీకు పసిబిడ్డలా కనిపిస్తున్నాడు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత హమీద , ముక్కు అవినాష్ శృంగారం పండించాలని టాస్క్ ఇవ్వగా టాస్క్ పూర్తయిన తర్వాత శ్రీముఖి మాట్లాడుతూ .. హమీద శృంగారం చేస్తుంటే బాగుంది.. కానీ ముక్కు అవినాష్ శృంగారాన్ని కాస్త కసిగా, ఆకలిగా ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది అంటూ కామెంట్లు చేసింది . మొత్తానికి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతుంది.