Sreelela టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోయిన్లలో ఎవరు అంటే టక్కున శ్రీ లీల(Sreelela) పేరు గుర్తుకువస్తుంది. యంగ్ హీరోయిన్లకు, సీనియర్ హీరోయిన్లకు దీటుగా సినిమాలలో నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదంతా ఇలా ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ఈ హీరోయిన్ కి ఫేవరెట్ హీరో ఎవరో చెప్పగానే అభిమానులు కాస్త షాక్ అవుతున్నారు.
శ్రీలీల ఫేవరెట్ హీరో బాలకృష్ణ అని చెప్పి అందరికీ ఒకసారిగా షాక్ ఇచ్చింది. బాలయ్య, అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న చిత్రంలో బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న పోస్టర్లు సినిమా పైన భారీగా అంచనాలకు పెంచుతున్నాయి. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి త్రివిక్రమ్ సినిమా గురించి చెప్పడానికి అనుమతి లేవని తెలియజేస్తోంది శ్రీ లీల.
నితిన్ కు జోడిగా ఒక చిత్రంలో నటిస్తున్న శ్రీ లీల ఈ విధంగా కామెంట్లు చేసింది. నేను ఏ సెట్ లో ఉన్నాను గుర్తుందా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారని శ్రీలీల తెలియజేయడం జరిగింది. బాలయ్యకు నేను ఫ్యాన్ అని తెలియజేశారు. బాలయ్యను కలిసిన తర్వాత ఆయనకు అభిమానిగా మారానని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తన పాత్ర చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందని తెలియజేసింది శ్రిలీల.
సోషల్ మీడియా వేదికగా ఈమె చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారుతున్నాయి.శ్రీలీల రేంజ్ ప్రతిరోజు పెరుగుతూనే ఉండడం గమనార్హం. దీంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు మరి ఈమె కెరియర్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి మరి.